ఏపీ పోలీసులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు షాకిచ్చారు. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ మే 11, 2024న నంద్యాలకు వచ్చారు. అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు శిల్పా ఇంటికి భారీగా చేరుకున్నారు. నంద్యాల నుంచి పోటీ చేస్తున్న తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలని ఐకాన్ స్టార్ కోరారు. భారీ సంఖ్యలో అభిమానులు రాడంతో అక్కడ చిన్నపాటి మీటింగ్ జరిగినట్లు కనిపించింది.
అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని స్థానిక ఆర్వో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి, అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. సినీ ప్రముఖులు పలువురు అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. తాజాగా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతు తెలిపారు. విశ్వేశ్వర్ రెడ్డి మంచి వ్యక్తి అని ప్రశంసించారు.









