AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లో చేరిన మావల ఎంపీపీ, మున్నూరుకాపు సంఘం నేతలు

అమ్మ‌న్యూస్, ప్ర‌తినిధి ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌తీ రోజు ఇతర పార్టీల నేతలు అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు. మాజీ ప్ర‌జా ప్ర‌తినిధులు, కుల సంఘ నాయ‌కులు, యువ‌జ‌న సంఘ నాయ‌కులు చేరిక‌ల‌తో కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ నెల‌కొంది. తాజాగా నేడు మావల ఎంపీపీ దర్శనాల ఏవన్, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు కాళ్ళ విట్టల్, సాంగ్వి మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు టింగని నరేష్, మెంగవార్ రవి కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విఠ‌ల్ నివాసంలో వారంద‌రికి కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ముఖ్య నాయకులు,కార్యకర్తలు,కాలనీ వాసులు పాల్గొన్నారు.

ANN TOP 10