AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష.. వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ

గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం వెల్లడించింది. ఓఎంఆర్‌ విధానంలోనే పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. తెలంగాణలో 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసి, దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తం 4లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు దరఖాస్తు చేసుకున్నారు.

మార్చి 23 నుంచి 27 వరకు సవరణలకు అవకాశం కల్పించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు చెప్పింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ANN TOP 10