AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆపద్బాంధవుడు ఏషాల మహేందర్‌

(అమ్మన్యూస్‌, నిజామాబాద్‌):
ఏషాల మహేందర్‌ దాతృత్వం చాటారు. పేద ప్రజల పాలిట అపద్బాంధువుడిలా నిలిచారు. నిజామాబాద్‌ జిల్లా రూరల్‌ నియోజకవర్గం, సిరికొండ మండలం తూంపల్లిలో బుధవారం సిరికొండ రాజవ్వ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందారు. వీరిది పేద కుటుంబం కావడంతో అంత్యక్రియల కోసం ఏషాల మహేందర్‌ రూ.5వేలు ఆర్థిక సహాయం అందించారు.

అలాగే చాలా రోజుల నుంచి గ్రామంలో పేదింటి ఆడపిల్ల పెళ్లికి పుస్తె మట్టెలు, వస్త్రాలు అందజేస్తున్నారు. పేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు. గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్న మహేందర్‌ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10