AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓటేయండి డైమండ్ రింగ్ పట్టేయండి.. ఈసీ నిర్ణయం

భోపాల్: ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అధికారులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓటు వేయండి.. గిఫ్ట్‌లు పట్టండి అంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసిన వారికి లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌తో పాటు ఇతర బహుమతులను ఆఫర్ చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓటర్లకు సంబంధించిందే ఈ వార్త.

ఓటింగ్‌ను పెంచడానికి గిఫ్ట్‌ల పేరుతో ఓటర్లను పోలింగ్‌ వైపుకు మళ్లించేలా చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు దశల ఓటింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదైంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను రప్పించేందుకు లక్కీ డ్రాను ప్రకటించింది. ఓటు వేయడం ద్వారా లక్కీ డ్రాలో భాగస్వామ్యం కావచ్చు.

ఇందులో పాల్గొన్నవారికి డైమండ్ రింగ్‌ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ మధ్యే రెండో దశ పోలింగ్ రోజున భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ప్రతి రెండు గంటలకు ఒక లక్కీ డ్రాను ప్రకటించింది. ఓటు వేసిన తర్వాత సిరా మార్క్ చూపించిన వారికి డైమండ్ రింగ్, ఫ్రిడ్జ్, టీవీ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు గెలుచుకునే ఛాన్స్ కల్పించింది.

మే 7న భోపాల్‌ మూడో దశ పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో మొదటి రెండు దశల్లో సగటున 8.5శాతం కంటే ఎక్కువగా పోలింగ్ శాతం తగ్గింది. 2019లో ఇతర చోట్ల పోలింగ్ శాతం పెరగగా, భోపాల్‌లో పోలింగ్ శాతం 65.7శాతం మాత్రమే నమోదైంది. దీంతో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఈసీ వివిధ మార్గాలను అన్వేశిస్తోంది.

ANN TOP 10