AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌.. సత్తాచాటిన బాలిక‌లు!

ఉత్తీర్ణులైన 91.31 శాతం మంది విద్యార్థులు
బాలుర ఉత్తీర్ణ‌త: 89.42 శాతం
బాలిక‌ల ఉత్తీర్ణ‌త: 93.23 శాతం
ప‌రీక్ష‌ల‌కు 5.05 ల‌క్ష‌ల మంది విద్యార్థుల హాజ‌రు
మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన‌ ప‌రీక్ష‌లు

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. హైద‌రాబాద్‌లో విద్యాశాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు మొత్తం 5.05ల‌క్ష‌ల మంది హాజ‌రు కాగా, ఉత్తీర్ణ‌త 91.31 శాతంగా న‌మోదైంది. ఇక తాజాగా విడుద‌లైన ఫ‌లితాల్లో బాలిక‌లు సత్తాచాటారు. 93.23 శాతం మంది బాలిక‌లు ఉత్తీర్ణుల‌య్యారు. బాలురు ఉత్తీర్ణ‌త 89.42 శాతం. 99.05 శాతం ఉత్తీర్ణ‌త‌తో నిర్మ‌ల్ జిల్లా టాప్‌లో ఉంటే.. 65.10 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన వికారాబాద్ చివ‌రి స్థానంలో నిలిచింది.

ANN TOP 10