AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం.. ప్లే ఆఫ్ రేసులో ముందడుగు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో సోమవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కేకేఆర్ 7 వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేకేఆర్ ధాటికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో KKR తరపున ఫిలిప్ సాల్ట్ 33 బంతుల్లో 68 పరుగులు తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఇందులో 5 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో, వెంకటేష్ అయ్యర్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సునీల్ నరైన్ 15 పరుగులు, రింకూ సింగ్ 11 పరుగులు చేశారు. . ఢిల్లీకి చెందిన అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా, లిజార్డ్ విలియమ్స్ 1 వికెట్ తీశాడు. ఈ సీజన్‌లో KKRకి ఇది ఆరో విజయం. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. అంతేకాదు ఈ విజయంతో కేకేఆర్‌ ప్లేఆఫ్‌ దిశగా మరో ముందుడుగు వేసింది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా స్కోరు చేయలేదు. అయితే చివరి నిమిషంలో కుల్దీప్ యాదవ్ 35 పరుగులు చేయడంతో ఢిల్లీ స్కోరు 150కి చేరుకుంది. కుల్దీప్ 35 పరుగులు, రిషబ్ 27 పరుగులు చేశారు. అభిషేక్ పోరెల్ 18, అక్షర్ పటేల్ 15, పృథ్వీ షా 13, జాక్ ఫ్రేజర్ మెక్‌గ్రుక్ 12 పరుగులు చేశారు. కోల్‌కతా తరఫున వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలా ఒక వికెట్ తీశారు. చూపించారు.

ANN TOP 10