AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో 12 సీట్లు పక్కా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

కార్యకర్తల్లో రెట్టింపు జోష్‌
వరంగల్, కరీంనగర్, సిద్దిపేట అభివృద్ధికి రూ.2,500 కోట్లు వెచ్చించాం

(అమ్మన్యూస్, ఖమ్మం):
తెలంగాణలో 12 ఎంపీ స్థానాల్లో కచ్చితంగా గెలిచితీరుతామని, కార్యకర్తల్లోనూ ఉత్సాహం రెట్టింపు కనిపిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం నిర్వహించిన బీజేపీ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. మనదేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ 11 స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మరో రెండేళ్లలో మనదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు.

రష్యా, చైనా ఆర్థికంగా బలహీన పడితే భారత్‌ బలపడిందని తెలిపారు. దేశంలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడేలా చేశామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులలో మన ఫార్మా కంపెనీలు నెంబరు వన్‌ గా ఎదిగాయని తెలిపారు. పదేళ్లలో ఆటో మొబైల్‌ రంగంలో సెల్‌ ఫోన్‌ లో తో పాటు రెట్టింపు స్థాయిలో మేకిన్‌ ఇండియా ఉత్పత్తులు జరిగాయని చెప్పారు.

గరీబ్‌ కల్యాణ్‌ పథకం, రైతులకు భరోసా ద్వారా వారి అకౌంట్లలో డబ్బులు వేశామని తెలిపారు. స్మార్ట్‌ సిటీగా వరంగల్, కరీంనగర్, సిద్దిపేటకి రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. సికింద్రాబాద్, మహబూబాబాద్‌ రైల్వే స్టేషనుకి నిధులు కేటాయించామని తెలిపారు. ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే వినోద్‌ రావు, సీతారాం నాయక్‌ ను గెలిపించి లోక్‌సభ పంపినట్లే కనపడుతోందని అన్నారు.

మోదీ నాయకత్వంలో రామ మందిరం నిర్మించామని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ తొలిగించామని చెప్పారు. కాంగ్రెస్‌ బలహీనమైన ప్రభుత్వమని అన్నారు. గిరిజనుల కోసం మోదీ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. జాతీయ స్థాయిలో గిరిజనుల కోసం చట్టాలు చేసిందని తెలిపారు.

ANN TOP 10