AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుళ్లిన కూరగాయలతో భోజనం.. రోడ్డెక్కిన విద్యార్థులు

కుళ్లిన కూరగాయలతో(Rotten vegetables) భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు (Students) ఆందోళనకు దిగారు. రోడ్డుపై కూరగాలను పడబోసి తమ నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా నాందేవ్ వాడలోని ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో(ST government hostel) నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులు మురిగిన కూరగాయలు రోడ్డు మీద పోసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భోజనం ఎవరైనా తింటారా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింజేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10