ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై మంగళసూత్ర వ్యాఖ్యలపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశ సంస్కృతిని కాపాడుతుందని అన్ని మతాన్ని గౌరవిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి మంగళ సూత్రాలు గురించి మాట్లాడటం అందరూ కూడా విన్నారని, ఒక ప్రధానమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని అన్నారు.మంగళసూత్రం అనేది ప్రతి మహిళా జీవితంలో ఒక భాగం దానిని మేము ఎంతగానో గౌరవిస్తామని చెప్పారు. మహిళల హక్కుల్ని కాపాడతామన్నారు. తన తల్లి సోనియాగాంధీ దేశం కోసం దాని సమగ్రత కోసం మంగళసూత్రాలని కోల్పోయారని ప్రియాంక గాంధీ భావోద్వేగ హృదయంతో అన్నారని డీకే శివకుమార్ గుర్తు చేశారు. కాగా ప్రధాన నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలను కూడా తీసుకువెళ్లి అమ్ముకుంటారని వ్యాఖ్యలు చేయగా.. తీవ్ర విమర్శల పాలవుతున్నారు.
