AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాల్లో ఒకదానికొకటి ఢీకొన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో ప్రమాదం జరిగింది. పదికి పైగా వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గల మిర్యాలగూడ వెళ్తున్నారు. ఓ వాహనాం.. సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయా వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. వాహనాలు మితిమీరిన వేగం కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మే 7వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర జరగనుంది. లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది.

ANN TOP 10