మాజీ సీఎం కేసీఆర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని 25 మంది ఎమ్మెల్యేలు తమతో కలిసి వస్తామని అంటున్నారని మరోసారి కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా గోలగోలగా ఉందని, మీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వారిలో మాట్లాడుతున్నారని గులాబీ బాస్ చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ వ్యాఖ్యలకు తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. అసలు కాంగ్రెస్‌లోకే 25 మంది ఎమ్మెల్యేలు వస్తామని అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్లోకి వెళ్లే పాతికమంది ఎమ్మెల్యేలు ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌లోకి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు చెబుతానని కౌంటర్ ఇచ్చారు. అర్భకులం కాదని, అర్జునులమై కాంగ్రెస్ నేతలందరూ పోరాడామని చెప్పారు. కాంగ్రెస్ అమలు చేసే హామీలు ఇచ్చిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 8 సీట్లు గెలుస్తే తాను రాజీనామా చేస్తామని చెప్పారు. వారికి ఎనిమిది సీట్లు వస్తే రాజకీయా నుంచి తప్పుకుంటారా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.
*కేసీఆర్ డిప్రెషనల్‌లో ఉన్నాడు*
మరోవైపు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశార్థకమే అంటూ కామెంట్స్ చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విన్నింగ్ టీమ్‌గా పనిచేస్తున్నామని తెలిపారు. సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.









