(అమ్మన్యూస్, హైదరాబాద్):
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లీ విగ్రహానికి పూల మాలలు వేసి గులాబి బాస్ బస్సు యాత్రకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర పై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ ప్రయాణించే బస్సులో ఎక్కాలని కొందరు మహిళలు చూడగా.. ‘ఇది ఫ్రీ బస్సు కాదమ్మా’ అంటూ కేసీఆర్ వారికి చెబుతున్నట్లుగా ఉన్న కార్టూన్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఎన్నికల సమయం లోనే జనాల్లోకి వస్తే ఇలానే ఉంటుంది అని కామెంట్లు చేస్తున్నారు..









