AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు మద్యం దుకాణాలు బంద్!

హైదరాబాద్‌లో మంగళవారం మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా 23 న ఉదయం 6 గంటల నుండి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వార్త తెలిసి మందు బాబులు బావురుమంటున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో జరిగే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఇక భాగ్యనగరంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. హిందువులు అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. వీధి వీధినా ర్యాలీలు తీస్తూ.. హనుమాన్‌ నామం జపిస్తుంటారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా భారీ ఊరేగింపులు, ర్యాలీలు ఉంటాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మంగళవారం నాడు మద్యం విక్రయాలను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ANN TOP 10