(అమ్మన్యూస్, హైదరాబాద్):
రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు బీఆర్‌ఎస్ నుంచి వలసలు, అధికార పక్షం నుంచి తీవ్రమవుతున్న విమర్శల దాడి నేపథ్యంలో నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం ఆయన మరోసారి టీవీ చర్చకు రాబోతున్నారు. ఎంపీ ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేపు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
గత నెలలో కరీంనగర్ వేదికగా జరిగిన కదనభేరీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే భూమి బద్దలైనట్లు కాంగ్రెస్ మాట్లాడుతోంది.. కాళేశ్వరం గురించి రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకు వచ్చి వివరిస్తానని కీలక ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత ఈ విషయంలో సైలెంట్ అయిపోయింది. తాజాగా రేపు ఓ ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘రేపు, తెలుగులో మహోన్నతమైన రాజకీయ ప్రముఖుడితో అతిపెద్ద, ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉండండి. మాతో ఎవరు చేరుతున్నారో మీరు ఊహించగలరా?’ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాష్ ట్యాగ్ లు ఇచ్చారు. దీంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కేసీఆర్ కొందరు జగన్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మెజార్టీ నెటిజన్లు మాత్రం ఇంటర్వ్యూకు రాబోయో గెస్ట్ కేసీఆరేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.









