AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సివిల్స్‌ టాపర్‌ అనన్యకు సీఎం సన్మానం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
యూపీఎస్సీ సివిల్స్‌–2023 ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన దోనూరి అనన్య రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. శనివారం జూబ్లీహిల్సో్లని సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి ఆమె కుటుబం సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం రేవంత్‌ రెడ్డి అభినందించి.. పుష్పగుచ్ఛం అందజేసి.. శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఉన్నారు.

కాగా, ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో పాలమూరుకు చెందని అనన్య రెడ్డికి మూడో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందని అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లో చదివిన అనన్య, ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె, 2020 నుంచి సివిల్స్‌ ప్రిపరేషన్‌ స్టార్ట్‌ చేసి.. టాపర్‌గా నిలిచారు.

ANN TOP 10