AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతున్నారు.. గుత్తా సుఖేందర్‌రెడ్డి

– కేసీఆర్‌ అహంకారి..
– ఆరు నెలలుగా ఎవరికీ అపాయింట్మెంట్‌ ఇవ్వడంలేదు
– అందుకే పార్టీని వీడుతున్నట్లు సుఖేందర్‌రెడ్డి వెల్లడి
– త్వరలోనే పార్టీ ఖాళీ కావడం పక్కా అంటూ స్పష్టీకరణ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌.. బిగ్‌ షాక్‌ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ అహంకారి అని, పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్‌ ఎవరికీ అపాయింట్మెంట్‌ ఇవ్వడం లేదని, అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పార్టీ ఖాళీ కావడం పక్కా అని అన్నారు. అయితే, తాజాగా గుత్తా కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లోకి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే నల్లగొండలో బీఆర్‌ఎస్‌కు భారీ దెబ్బ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ANN TOP 10