AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌‌లో దంచికొడుతున్న వర్షం.. మరో మూడ్రోజుల పాటు వానలే..

హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతుంది. నిన్నటి వరకు ఎండల తీవ్రతో అల్లాడిపోయిన ప్రజలకు.. చల్లటి వాతావరణం ఉపశమనం కలిగించింది. ఉదయం నుంచి మబ్బుల వాతారవణం ఉండగా.. కొద్దిసేపటి నుంచి వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కార్వాన్, సికింద్రాబాద్, లంగర్ హౌస్, షేక్‌పేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బర్కత్‌పురా. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, చిక్కడపల్లి, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, మాదాపుర్, నార్సింగి, గండిపేట్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, హస్తినాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత నగరంలో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వర్షం రైతులకు నష్టాన్ని మిగుల్చుతోంది. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పలు మండలాల్లో తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నేలరాలింది. వడగండ్ల వానతో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

ఈ ఏడాది వానలు ఎక్కువే.. ఐఎండీ చల్లని కబురు
మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, నారాయణపేట కొమరంబీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, హన్మకొండ, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ANN TOP 10