భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చార్ ధామ్ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించింది.
నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కాకుండా మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా భక్తులు పేరు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో పేరు, మొబైల్ నంబర్, నివాస చిరునామాను అందించాలి. గుర్తింపునకు సంబంధించిన కార్డును స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాలి. మే10న చార్ ధామ్ యాత్ర లాంఛనంగా ప్రారంభమవుతుంది. బద్రీనాథ్ తలుపులు మే 12న తెరుచుకుంటాయి.
