సేవలను స్మరించుకున్న కేఎస్ఆర్
సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహానుభావుడని కితాబు
అమ్మ న్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి జ్యోతీ రావు పూలే 197వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దస్నాపూర్ లోని బిసీ స్టడీ సర్కిల్ లో గత ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు విశేషంగా కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు.ఆయన అడగు జాడల్లో మనమంతా నడవాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,మాజీ డీసీసీబీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,ఎం. ఏ షకీల్, కయ్యుమ్,అంజద్ ఖాన్,కర్మ,అస్బాత్ ఖాన్,భరత్ వాగ్మారే,నాగర్కర్ శంకర్,ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,ఐఎన్టియూసిజిల్లా ఉప అధ్యక్షులు కొండూరి రవి,కేఆర్కే కౌన్సిలర్ ఆనంద్,డేరా కృష్ణ రెడ్డి,గోపిడి రుక్మ రెడ్డి,బండి దేవిదాస్ చారి,పోరెడ్డి కిషన్,ఓరగంటి అఖిల్,బూరే సురేష్,దూపే శంకర్,తదితరులు పాల్గొన్నారు.










