ఈద్గా వద్ద రంజాన్ వేడుకలకు హాజరు
కంది శ్రీనన్నతో యువకుల సెల్ఫీలు
ఉత్సాహంతో పండగ సంబరాలు
అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ :
గంగా యమున నదుల సమ్మేళనంలా భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉంటారని, ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్బంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గాను సందర్శించారు. ప్రార్ధనల అనంతరం బయటికొచ్చిన ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ సంవత్సరం ఇలాగే ఆనందోత్సహాల మధ్య పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరితో కలిసి ఉత్సాహంగా పండగ సంబరాల్లో పాలుపంచున్నారు. యువకులు , పిల్లలు కంది శ్రీనివాస రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వారితో ఫోటోలు దిగి ఉత్సాహ పరిచారు.

ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,మైనారిటీ నాయకులు ఎం. ఏ షకీల్,మొహమ్మద్ కయ్యుమ్, పత్తి ముజ్జు,షేక్ మన్సూర్,రాజ్ మొహమ్మద్,అంజద్ ఖాన్,కర్మ,అస్బాత్ ఖాన్,సయ్యద్ సుజాత్ అలీ,అయాస్,మాజీ డీసీసీబీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,భరత్ వాగ్మారే,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,నాగర్కర్ శంకర్,ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,ఐఎన్టియూసిజిల్లా ఉప అధ్యక్షులు కొండూరి రవి,కేఆర్కే కౌన్సిలర్ ఆనంద్,డేరా కృష్ణ రెడ్డి,గోపిడి రుక్మ రెడ్డి,బండి దేవిదాస్ చారి,పోరెడ్డి కిషన్,దొగ్గలి రాజేశ్వర్,ఓరగంటి అఖిల్,ఓరగంటి రఘు,బూరే సురేష్,దూపే శంకర్,జగదీశ్వర్ రెడ్డి,దర్శనాల చంటి తదితరులు పాల్గొన్నారు.









