AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 13 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

పార్లమెంట్ ఎన్నికలకు సమయం మరింత దగ్గర అవుతున్న నేపథ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని రెడీ అయ్యారు. ఈ నెల 13 నుంచి గులాబీ దళపతి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బస్సు యాత్రను ప్రారంభించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలు బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే రెండో రోజులు సూర్యాపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో పర్యటించి పంటను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్రలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి.. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని గులాబీ అధినేత సిద్ధమయ్యారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10