AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముంబై విశ్వరూపం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ టార్గెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి.. 234 పరుగుల భారీ టార్గెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది. ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఢిల్లీ బౌలింగ్‌ ఎంచుకుని, ప్రత్యర్థి ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన ముంబై జట్టు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ రోహిత్ శర్మ 49 పరుగులతో ఆదరగొట్టగా.. అటు మరో ఓపెనర్ ఇషాంత్ కిషన్ 42 పరుగులు చేసి పర్వలేదని పించాడు.

తొలి వికెట్ కోల్పోయిన సమయానికి ముంబై 80 పరుగులు చేసింది. రోహిత్ ఔట్ తర్వాత.. వచ్చిన సూర్య కుమార్ యాదవ్ డకౌట్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్థిక్ పాండ్యా 39, టీమ్ డేవిడ్ 45 (నాటౌట్), షెఫర్డ్ 39 (నాటౌట్) చివర్లో వచ్చి దూకుడుగా ఆడాడు. షెఫర్డ్ చివరి ఓవర్లలో 4 సిక్సులు, 2 ఫోర్లతో విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో ముంబై భారీ టార్గెంట్‌ దిశగా వెళ్లింది. ఇందులో ఢిల్లీ బౌలర్లు నోకియా, అక్సర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.ఇక 235 విజయ లక్ష్యంతో ఢిల్లీ బరిలోకి దిగింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10