AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అబిడ్స్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌(Election Code) అమలులోకి రావడంతో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం నగరంలోని అబిడ్స్‌(Abids) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులు, ఆటోలు ఇతర వాహనాలను తనిఖీలు చేశారు.

ముత్యాలు, రాజేష్‌ అనే ఇద్దరు వ్యక్తులు సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.40 లక్షలను సీజ్‌(40 lakhs seized) చేశారు. ఇద్దరని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రతి వ్యక్తి రూ.50వేలకు మించి నగదు ఉంటే సీజ్‌ చేస్తామని పోలీసలు తెలిపారు.

ANN TOP 10