హీరో సుహాస్ వరుసగా హిట్ సినిమాలు అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయాన్ని అందుకోగా.. అది ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. అలాగే శ్రీరంగనీతులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యువ నటులు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కొత్త కొత్త కథలతో పాటు నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. హీరోగా మరిన్ని సినిమాలు సుహాస్ చేతిలో ఉన్నాయి. తాజాగా సుహాస్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఆ సినిమాకు నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమవ్వగా.. ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. జో సినిమాలో ఫుల్ పాపులార్టీని అయిన తమిళ్ హీరోయిన్ మాళవిక మనోజ్ నటిస్తుంది. అయితే ఈ సినిమాతో ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత హాసనందిని తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. అనిత చివరగా తెలుగులో 2016లో మనలో ఒకడు సినిమాలో నటించింది. ఇప్పుడు మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుండగా.. ఆమె ఏ పాత్రలో నటించనుందో ఆసక్తికరంగా మారింది.









