AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మే 13న కురుక్షేత్ర యుద్దమే: సీఎం జగన్

మే 13న కురుక్షేత్ర యుద్దం జరుగబోతుందని, ఈ యుద్దంలో పేదలంతా ఒకవైపు.. పెత్తందారులు మరోవైపు అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పొత్తులను, జిత్తులను ఎదుర్కొంటూ పేదల భవిష్యత్‌కి అండగా నిలిచేందుకు నేను సిద్ధం అంటున్నారని అన్నారు. శుక్రవారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుందన్నారు. జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతమన్నారు. గడిచిన 58 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. విద్యారంగంలో మార్పులను తీసుకొచ్చాం. ఈరోజు మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్ మారుతుంది. మీ పిల్లల భవిష్యత్ కోసం యుద్ధం చేయడానికి నేను సిద్దం.. మీరంతా సిద్దమేనా..? అని అడుగుతున్నానని సీఎం జగన్ అన్నారు.

గత పదేళ్లలో రాష్ట్రంలో మంచి జరిగిందని ప్రతి గుండె చెబుతోందన్నారు. ఈ మంచిని ఇలాగే కొనసాగించాలని ప్రతి గుండె కోరుకుంటుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యారంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చామని, మంచి చేసిన ప్రభుత్వానికి మరోసారి మద్దతు ఇవ్వండని కోరారు. పేదల వ్యతిరేకిని ఓడించాలని, మీ బిడ్డను గెలిపించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందని, నామినేటెడ్ పదవుల్లో మహిళలకే 50 శాతం ఇచ్చామన్నారు. చంద్రబాబు హయంలో మహిళాల ఖాతాల్లోకి డబ్బు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు మోసాలు, మాయాలను నమ్ముకున్నాయని విమర్శించారు. 2.5 కోట్ల మంది మహిళల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని చెప్పారు. రైతు అనుకూలత, వ్యతిరేకులకు మధ్య ఈ ఎన్నికలు అంటూ వ్యాఖ్యలు చేశారు. రైతు రూణమాఫీ పేరిట చంద్రబాబు వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి అందరూ అండగా నిలువాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10