బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు అయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. చెంగిచెర్లలో ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బుధవారం అక్కడకు వెళ్లారు. అక్కడకు ఆయన రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరినీ లోనికి అనుమతించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అనుమతి లేదని చెప్పినా బారికేడ్లను తోసి పోలీసులను తొక్కించారని సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో తన విధులకు ఆటంకం కలిగించారని, తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్రెడ్డికి గాయాలయ్యాయని పేర్కొంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయనతో మరో 9 మందిపై కేసు నమోదు చేశారు.