రెండు తెలుగు రాష్ట్రాల యూత్‌ను ఊపేస్తున్న ఒకే ఒక్క పేరు అయేషా ఖాన్. చేసిన మొదటి సినిమా ట్రైలర్లో కనిపించిన రెండు సెకన్ల వీడియోతో ఓవర్ నైట్‌లో యూత్ కలల రాణిగా రాణించింది. అంతేకాదు విపరీతమైన ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది.
వివరాళ్లోకి వెళితే.. 2020లో వచ్చిన హిందీ సిరీస్ బాల్ వీర్లో చిన్న పాత్రలో కనిపించిన ఈ చిన్నది అయేషా ఖాన్ తర్వాత ఏకంగా విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ చేసిన ముఖచిత్రం సినిమాలో రెండో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత 2023 లో స్టార్ట్ అయిన హిందీ బిగ్‌బాస్ 17 లో కంటెస్టెంట్‌గా జాయిన్ అయి ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఓం భీం భుష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా టాలీవుడ్‌ను షేక్ చేసింది.