AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు డీజిల్‌ స్మగ్లింగ్‌.. కోకాపేటలో 15 వేల లీటర్లు సీజ్‌

హైదరాబాద్‌: కర్ణాటకలో తక్కువ ధరకు డీజిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను (Diesel Smuggling) పోలీసులు అరెస్టుచేశారు. కోకాపేటలో అక్రమంగా డీజిల్‌ను అమ్ముతున్న ఆరుగురిని సైబరాబాద్‌ ఎస్‌వోటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోముగ్గురు పరారీలో ఉన్నారు. వారి నుంచి 15 వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తొమ్మిది మంది సభ్యులతో కూడిన డీజిల్‌ స్మగ్లింగ్‌ ముఠా.. కర్ణాటకలో లీటరు డీజిల్‌ను రూ.85.75కు కొనుగోలుచేసి భారీ ట్యాంకర్లలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారని, నగర శివార్లలో దానిని చిన్న ట్యాంకర్లలో నింపుతున్నారని చెప్పారు. దానిని క్రషర్‌ యజమానులు, ఇసుక లారీలకు రూ.92 నుంచి రూ.94కు బిల్లులు లేకుండా విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నాలుగు డీజిల్‌ ట్యాంకర్లను సీజ్‌ చేశామని, పట్టుబడిన 15 వేల లీటర్ల డీజిల్‌ ధర మార్కెట్లో రూ.14.36 లక్షలు ఉంటుందన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారయ్యాని, వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా, ఈవ్యవహారంపై సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ANN TOP 10