AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మల్కాజిగిరి బరిలో సునీతారెడ్డి!.. ఫైనల్‌ చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం?

నియోజకవర్గ నేతలకు హింట్‌ ఇచ్చిన రేవంత్‌రెడ్డి
నాయకులకు, కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌):
మల్కాజిగిరి బరిలో పట్నం సునీతారెడ్డి పేరు ఫైనల్‌ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. గురువారం పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు హింట్‌ ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్నా అందరి దృష్టి మాత్రం మల్కాజిగిరి సెగ్మెంట్‌ పైనే ఉంది. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్‌ స్థానం కావడంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మరోవైపు ఎలాగైనా ఈ సెగ్మెంట్‌లో జెండా పాతేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన నేతలతో ఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాల్టాజిగిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు రేవంత్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

మల్కాజిగిరి కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి దక్కబోతున్నది అనేది చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన – నాయకుల భేటీ కార్యక్రమంలో సీఎంతో పాటు పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖాయం అయిందనే చర్చ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది.

కాంగ్రెస్‌ ఎండా ఎగరాల్సిందే..
ఎట్టిపరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాల్సిందే నంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం పార్లమెంట్‌ నియోజవకర్గ నాయకులు, కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో సమావేశమయ్యారు. ‘ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం.. మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎన్నిక అభ్యర్థిది కాదు.. ముఖ్యమంత్రిది.. నా బలం.. నా బలగం మీరే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ నాయకులదే..’నని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాల్సిందేనని నేతలకు పార్టీ నేతలకు సూచనలు చేశారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ స్థానం మల్కాజిగిరి.. నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి సీఎం స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు.
కేసీఆర్‌ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచే మొదలైందని చెప్పారు.

రాష్ట్ర మంతా కాంగ్రెస్‌ తుపాన్‌ వచ్చినా..
మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి.. స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ రావాలన్నా.. జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రమంతా తుపాను వచ్చినట్లు గెలిచినా మల్కాజిగిరి పార్లమెంట్‌లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే.. అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. అందుకే మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. ప్రణాళికబద్దంగా ప్రచారం నిర్వహించుకోవాలని, మల్కాజిగిరి క్యాంపెయిన్‌ మోడల్‌ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు.

ANN TOP 10