బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ శాసన మండలి సభ్యుడు పురాణం సతీష్ కుమార్ కారు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్‌గా మార్చి తప్పు చేశారన్నారు. ఇలా పేరు మార్చడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు.