హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధ్యతలు అప్పగించారు. సోమవారం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu)కు పంపించారు.
తమిళిసై రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో గవర్నర్‌ను నియమించే వరకూ రాధాకృష్ణనే గవర్నర్‌గా కొనసాగనున్నారు.