తెలంగాణలో మూడు రాజకీయ పార్టీలకు సంబంధించి కీలక పరిణామాలు జరిగాయి. శుక్రవారం రోజే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇదే రోజు సీఎం రేవంత్‌రెడ్డి ముస్లిం సోదరులకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. మరోవైపు ప్రధాని మోదీ మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థుల తరఫున రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల్లో మద్దతు కోరారు. మూడు పార్టీలకు చెందిన ఈ మూడు కార్యక్రమాలు హైదరాబాద్‌లోనే జరగడం గమనార్హం.









