AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘100 రోజుల పాలనపై ప్రజలు పండుగ చేసుకోవాలి’

రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారాని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు కావడంతో ప్రజలు పండగ చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన చేయడంలో విఫలమైందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రజల భరోసా కనపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. కాబినెట్‌లో కూడా కాంగ్రెస్ మహిళలకు స్థానం కలిపించిందన్నారు. ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసి గౌరవించిందన్నారు. ప్రభుత్వానికి సీఎం, డిప్యూటీ సీఎం రెండు కళ్ళు లాగా పరిపాలన సాగుతుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన 9 ఏళ్ళు పోరాడినందుకు వారి పక్షాన తనకు ఎమ్మెల్సీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన ప్రతి స్కీమ్ అమలు చేసే విధంగా పాలన ఉందన్నారు. పేద ప్రజల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షలకు పెంచామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టిందని, 3 కోట్ల మహిళలు ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం చేశారని గుర్తు చేశారు. అలాగే 200 వరకు రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేసిందన్నారు.

చెప్పినవే కాదు.. చెప్పనవి కూడా చేస్తాం

ఇందిరమ్మ ఇళ్ల ఇవ్వడానికి కూడా ప్రభుత్వం స్వీకారం చుట్టిందని, నిరుద్యోగులకు చెప్పిన్నట్లే ఉద్యోగాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇది నిజమైన ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తోందన్నారు. 100 రోజుల్లో రోజుకో సమస్య పరిష్కరిం చిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇది ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ చిట్ చాట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల వద్దకు వస్తు వంద రోజుల్లో తాము ఏమి చేశామో ప్రజలే చెబుతారని అన్నారు. మాది ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వమని, చెప్పిన హామీలని నెరవేరుస్తుందని, ఆ దిశగానే రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కొనియాడారు. తాము చెప్పినవే కాదు.. చెప్పనవి కూడా చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. 420 గాళ్లు తమ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని, ప్రజలు ప్రతిపక్షాల మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేరని బల్మూరి వెంకట్ చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10