న్యూఢిల్లీ: యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల– 2024 షెడ్యూల్ విడుదల కానుంది. శనివారం సాయంత్రం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్‌లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి రానుంది. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం ప్రకటించనున్నారు.