హంసవాహనంపై యాదగిరీశుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
స్వామివారి అలంకార సేవోత్సవంలో భాగంగా గురువారం నృసింహస్వామి ఉదయం వటపత్రశాయి అలంకార సేవలో, రాత్రి హంసవాహనంలో ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.