AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. సీఎం రేవంత్ హాజరు

రంజాన్ దీక్ష‌లు ప్రారంభ‌మైన నేపథ్యంలో ముస్లీంలకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో కఠిన ఉపవాసం చేస్తున్న ముస్లింలందరూ పాల్గొనాలని కోరారు. సీఎం హాజరయ్యే ఇఫ్తార్ విందు నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. శుక్రవారం 15 న సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారని తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

ANN TOP 10