AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ సర్కార్‌పై దానం ప్రశంసలు

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌):
రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు రోజుకో పండగ వస్తోందని అన్నారు. రేవంత్‌ సర్కార్‌ వారికి అన్నీ శుభవార్తలే చెబుతోందని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్‌ బస్సులు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు

అందుబాటులోకి 22 ఎలక్ట్రిక్‌ బస్సులు
టీఎస్‌ ఆర్టీసీలో 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నగరంలోని నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలు జెండాఊపి వీటిని ప్రారంభించారు. అనంతరం నూతన ఎలక్ట్రిక్‌ బస్సును మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నడపగా.. భట్టి, పొన్నం ప్రభాకర్‌ లు బస్సులో కూర్చొని సచివాలయం వరకు వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొని ప్రసంగించారు.

ANN TOP 10