ఇంట్లోనే డాక్టర్లతో చికిత్స
నేడు కరీంనగర్‌లో జరిగే ‘కదన భేరి’కి దూరం
(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్):
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రంగా జ్వరం వేధిస్తుండటంతో ఆయన రెండు రోజులుగా ఇంట్లోనే డాక్టర్లతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు కరీంనగర్‌లో జరిగే బీఆర్‌ఎస్ ‘‘కదన భేరి’’ సభకు కేటీఆర్ దూరంగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
కాగా.. ఈరోజు కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ మైదానంలో బీఆర్‌ఎస్ కదన భేరి సభ జరుగనుంది. కరీంనగర్ సభ నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కేసీఆర్ సమీక్షలు చేస్తున్నారు. వరుసగా పార్టీని వీడుతున్న నేతలు, పోటీకి నాయకుల ఆసక్తి చూపకపోవడంతో బీఆర్‌ఎస్‌లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేసీఆర్ కరీంనగర్ సభతో కేడర్‌లో భరోసా నింపేందుకు సిద్ధమవుతున్నారు.