ధర్మశాల: ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంతో టీమిండియా చారిత్రక రికార్డు సృష్టించడం విశేషం. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. గత మ్యాచ్‌ల మాదిరిగానే చివరి టెస్టులోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. 259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. భారత స్పిన్నర్ల ధాటికి 48.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 195 పరుగులకే కుప్పకూలింది. జోరూట్ ఒక్కడే 84 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
వందో టెస్టు మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీసిన అశ్విన్ మొత్తం 9 వికెట్లతో తన వందో టెస్టును చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను రోహిత్ సేన 4-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో ఓడిన భారత జట్టు ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. మిగతా 4 టెస్టులను వరుసగా గెలిచింది. విశాఖ, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరిగిన టెస్టుల్లో ఘనవిజయాలు నమోదుచేసింది. భారత్ విజయాల్లో యువ క్రికెటర్లు కీలకపాత్ర పోషించారు.
259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను సెకండ్ ఓవర్లోనే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బ తీశాడు. ఓపెనర్ బెన్ డకెట్‌ను 2 పరుగులకే ఔట్ చేశాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలేను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓలీ పోప్(19)ను కూడా త్వరగా పెవిలియన్ చేర్చాడు. దీంతో 36 పరుగులకే ఇంగ్లండ్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌ను జోరూట్, జానీ బెయిర్‌స్టో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 56 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని 18వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ విడదీశాడు. ధాటిగా ఆడి 3 ఫోర్లు, 3 సిక్సులతో 31 బంతుల్లోనే 39 పరుగులు చేసిన బెయిర్‌స్టోన్‌ను లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్(2)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో లంచ్ విరామ సమయానికి 103 పరుగులకే ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది.