హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దాదాపు లక్ష మంది మహిళలచే రాష్ట్ర మహిళా సదస్సు ను నిర్వహించ నున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Chief Secretary Shantikumari) తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాల మహిళలతో నిర్వహించనున్న మహిళా సదస్సు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సదస్సులో ముఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిధిగా హాజరవుతారని వివరించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు, పార్కింగ్, హాజరయ్యే మహిళలకు ఏర్పాట్లపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సమావేశంలో డీజీపీ రవీ గుప్తా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు, అధికారులు పాల్గొన్నారు.