తెలంగాణ కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించాలని అగ్రనేతలు భావించినప్పటికీ.. 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అభ్యర్థులు ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది. గురువారం రాత్రి సీఈసీలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత జాబితాను ఫైనల్ చేయడం జరిగిందని సమాచారం. ఇవన్నీ అయ్యాక.. ఇక అగ్రనేతలు అధికారిక ప్రకటిసిస్తారన్న సమయంలో ఏఐసీసీ కార్యాలయం నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయం నుంచి బయటికి వచ్చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కాసెపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇదిగో జాబితా..!
9 స్థానాలపై సీఈసీలో జరిగిన చర్చ జరగ్గా.. మొదటి జాబితాలో ఏడుగురు అభ్యర్థులను ప్రకటించడానికి అగ్రనేతలు సన్నాహాలు చేస్తున్నారు.
1. మహబూబ్నగర్ : వంశీ చంద్ రెడ్డి
2. సికింద్రాబాద్: బొంతురామ్మోహన్
3. పెద్దపల్లి : గడ్డం వంశీ
4. నల్గొండ : రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కుమారుడు)
5. మహబూబాబాద్ : విజయాబాయి బానోతు/ బలరాం నాయక్
6. చేవెళ్ల : పట్నం సునీతా రెడ్డి
7. మల్కాజ్గిరి : కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ)