ఆయన అల్లుడూ అదేదారిలో..
సీఎం సలహాదారు వేంనరేందరెడ్డితో వీరిద్దరు భేటీ
ఈ నెల 9న, లేదంటే 11న చేరికకు రంగం సిద్ధం
పూలమ్మిన.. పాలమ్మిన.. అని చెప్పే మల్లన్న గులాబీ పార్టీకి పెద్ద రaలక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. గురువారం సీఎం సలహాదారు వేం నరేందరెడ్డితో వీరిద్దరు భేటీ కావడంతో హస్తం గూటికి వెళ్లడం పక్కా అని మల్లన్న సన్నిహితులే బాహాటంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పిలుస్తారా..? ఎప్పుడు పార్టీ జంప్ చేద్దామా..? అని మల్లారెడ్డి వెయిటింగ్ చేస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన మల్లారెడ్డి అవి బెడిసి కొట్టడంతో కాంగ్రె స్‌లోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కీలక మంత్రితో భేటీ..
రాష్ట్ర మంత్రి వర్గంలోని ఓ కీలక మంత్రిని ఈ నెల 4వ తేదీన మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలు రహస్యంగా కలిసినట్లు సమాచారం. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్లు తెలిసింది. తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే మంత్రి మాత్రం మీ రాకను పార్టీ పెద్దలు ఒప్పుకోక పోవచ్చని, కానీ తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చినట్లు తెలిసింది. సీఎంను ఎలాగైనా ఒప్పించాలని, లేకపోతే ఢల్లీి స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్లు తెలిసింది.
డీకేతో రాయబారం..
కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. కర్నాటక స్టేట్ కే చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ద్వారా డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఉంది. అయితే డీకే శివకుమార్ ఒక వేళ పార్టీ పెద్దలను ఒప్పించగలిగితే ఈ నెల 9వ తేదీన మేడ్చల్ నియోజకవర్గం కండ్లకోయలో జరిగే సీఎం సభలో పార్టీలో చేరాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. లేదంటే ఈ నెల 11వ తేదీన తన చిన్న కొడుకు భద్రారెడ్డితో సభ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం ఉంది.