AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రికార్డు స్థాయిలో విద్యుత్‌ సరఫరా

రేవంత్‌ సర్కార్‌ సరికొత్త ఘనత
రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే విద్యుత్‌ సరఫరాలో రేవంత్‌ సర్కార్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. కరెంట్‌ సరఫరాలో గతేడాది రికార్డును కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టింది. రికార్డు స్థాయిలో కరెంట్‌ సరఫరా జరిగింది. విద్యుత్‌ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6న 298.19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేశాయి.

గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేది. అయితే బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగదారులకు 298.19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసి కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్నపటికీ విద్యుత్‌ సంస్థలు దానికి తగిన విధంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి.

ANN TOP 10