రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం 5.08 లక్షల మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్ల కోసం www.bse.telangana.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చని అధికారులు సూచించారు.
