టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె..ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది. తాజాగా కాజల్ హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఇక్కడే తనకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నం.10లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చింది కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మకు చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం అభిమానులకు సెల్ఫీలు ఇచ్చింది. ఓ ఆకతాయి అభిమాని మాత్రం కాజల్ తో ఫొటో దిగుతూ ఆమె నడుముపై చెయ్యేశాడు. ఊహించని ఆ ఘటనతో కాజల్ ఒక్కసారిగా షాకయ్యింది. వెంటనే అతడిని బౌన్సర్లు పక్కకు లాగేశారు. కానీ ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.