సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కారు మెకానిక్ షెడ్డులో మంటలు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కారు మెకానిక్ షెడ్డు యజమాని తెలిపారు. మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.