AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు హ‌స్తిన‌కు సీఎం రేవంత్ రెడ్డి… ఏఐసీసీ ఎలక్షన్‌ కమిటీతో భేటీ..

సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎలక్షన్‌ కమిటీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ 9 మందితో తొలి విడత జాబితా విడుదల చేయగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు.

దీంతో అధికార కాంగ్రెస్ కూడా వీలైనంత వేగంగా అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా రేపు అభ్యర్థుల్ని ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. దీంతో ఆయన రేపు సమావేశం అనంతరం లోక్‌సభ అభ్యర్థులపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఆమోదంతో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కాంగ్రెస్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.

ANN TOP 10