హైదారాబాద్ (Hyderabad) నాచారంలోని పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకర్ బయోటెక్ (Srikar Biotech) అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మంటలు ఒక్కసారిగా భారీగా ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.









