AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎంపీ దీవకొండ దామోదర్‌రావుకు కేసీఆర్‌ పరామర్శ

రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్‌రావును బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరామర్శించారు. ఇటీవల దామోదర్‌రావు తల్లి ఆండాళమ్మ కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లిన కేసీఆర్‌ దామోదర్‌రావుతో పాటు ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఇదిలా ఉండగా.. ఆండాళమ్మ గతకొంతకాలంగా వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం వేకువ జామున తుదిశ్వాస విడిచారు.

ANN TOP 10